థాయ్‌లాండ్:చిన్నారి నిద్రలో నడుస్తూ.. 11వ అంతస్తు నుంచి..
- May 17, 2019
ఒక్క అంతస్తు నుంచి కింద పడితేనే ఒక్కోసారి ప్రాణాపాయం సంభవిస్తుంది. అలాంటిది, 11వ అంతస్తు నుంచి పడిపోతే, బతికే ఛాన్స్ ఏమాత్రం ఉండదు. కానీ థాయ్‌లాండ్ లో ఓ చిన్నారి 11వ అంతస్తు నుంచి కిందపడినప్పటికీ ప్రాణాలతో బయటపడింది. మృత్యుంజయురాలిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీచా సూక్పలం అనే వ్యక్తి తన కుమార్తెతో కలిసి థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణానికి వెళ్లాడు. వీరిద్దరూ అక్కడే ఓ హోటల్లో బస చేశారు. ఐతే, దీచా కుమార్తెకు నిద్రలో నడిచే అలవాటుంది. దాంతో ఆమె నిద్రలో నడుస్తూ నేరుగా బాల్కనీ వైపు వెళ్లి గోడపైకి ఎక్కి వేలాడింది. కాసేపు గోడపై వేలాడిన చిన్నారి పట్టు తప్పడంతో 11వ అంతస్తు నుంచి పడిపోయింది. దాంతో ఆ పాప గట్టిగా కేకలు పెట్టింది. హోటల్ సిబ్బంది వచ్చేసరికే ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..