రేపే విజయ్ కొత్త సినిమా ప్రారంభం..
- May 18, 2019అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ..ఓ సినిమా రిలీజ్ కు సిద్ధం అవ్వగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ చిత్రం సెట్స్ ఫై ఉండగానే క్రాంతి మాధవ్ సినిమాలో జాయిన్ అయినా విజయ్..ఇప్పుడు డియర్ కామ్రేడ్ రిలీజ్ కు సిద్ధం కాగానే మరో సినిమాను లైన్లో పెట్టాడు. తమిళ్ డైరెక్టర్ ఆనంద్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు ఆ సినిమాకు ముహూర్తం కుదిరింది.
రేపు ఈ సినిమాకు సంబందించిన పూజా కార్య క్రమాలు జరపనున్నారు. ఈ సినిమాలో విజయ్ బైక్ రైసర్ గా కనిపించబోతున్నాడు. రేపు శ్రీకారం చుట్టి, ఈనెల 22 నుంచి రెండు బైక్ రేసింగ్ సీన్లు చిత్రీకరణను ఢిల్లీలో ప్రారంభించబోతున్నారు. ఈ రెండు సీన్లకే దాదాపు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట మైత్రి మూవీస్ వారు. ఇందుకోసం విదేశాల నుంచి బైక్ రేసర్లను, డ్రోన్ లను, ఆపరేటర్లను, స్కార్పియో ఎక్విప్ మెంట్ ను తెప్పిస్తున్నారు. కేవలం రైస్ ట్రాక్ మీద షూటింగ్ పర్మిషన్ కే కోటికి పైగా చెల్లించినట్లు తెలుస్తోంది.
మరి ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఇక భరత్ కమ్మ డైరెక్షన్లో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ