'ఐ హేట్ యూ అమ్మ'... లఘుచిత్రం
- May 18, 2019'ఐ హేట్ యూ అమ్మ'... లఘుచిత్రం. తరాల అంతరాల్లో తల్లి మాట, పాత్ర ఓవర్ ప్రొటెక్టివ్‌గా కనిపిస్తోంది. ఎంత వయసుకొచ్చినా ఇంకా తెలుసుకోవాల్సింది ఉందనే విషయాన్ని పదేపదే మాట్లాడే యుక్తవయస్సు పిల్లలే, అమ్మ భయాల దగ్గరకొచ్చేసరికి విపరీత అసహనానికి లోనవుతారు. చాదస్తంగా కొట్టిపడేస్తారు. తల్లి తమను ఇంకా చిన్నపిల్లల్లా చూస్తోందని ఫ్రస్టేట్ అయ్యేవారే, తల్లి జాగ్రత్తల్ని అర్థంచేసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. ఈ జెనరేషన్ గ్యాప్ సమస్య చుట్టూతానే ఈ కథ నడుస్తుంది. ఆరు నిమిషాల చిన్ని చిత్రమే అయినా, చాలా పెద్ద విషయాన్ని చర్చిస్తుంది. 'ఏదైనా గాయపరిచే వస్తువుకి దూరంగా జరగడం...' అనే ఓ చిన్న మాటతో తల్లి జాగ్రత్త మనస్తత్వాన్ని యంగ్ మైండ్స్‌కి అర్థం చేయించే ప్రయత్నం చేసిన దర్శకడు సతీష్ రెడ్డి మల్లిడి, రచయిత భార్గవ్ రైట్స్‌ను అభినందించాలి. సోనియా సింగ్ నటనతో ఆకట్టుకుంటుంది. శరత్ అంకిత్ నడిమింటి, చిన్నవాసుదేవ రెడ్డి ఈ చిత్ర నిర్మాతలు. యూట్యూబ్ చానెల్ 'హే పిల్లా..!'లో ఈ చిత్రాన్ని వీక్షించొచ్చు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్