రాళ్ళపల్లికి కన్నీటి వీడ్కోలు
- May 20, 2019
సినీ హాస్యనటుడు రాళ్ళపల్లి వెంకట నరసింహారావుకు ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో సోమవారం ఉదయం నిర్వహించారు. మొదట తన నివాసం నుంచి ప్రారంభమైన ఆయన అంతిమ యాత్ర రాయదుర్గం మహాప్రస్థానానికి చేరుకుంది. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని స్మశాన వాటికకు తీసుకొని వచ్చి విద్యుత్ దహన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టారు. అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు రాజశేఖర్, జీవిత దంపతులు, కోట శ్రీనివాసరావు, భరద్వాజ, తనికెళ్ళభరణి, బాబూమోహన్, శివాజీరాజాతో పాటు ఆయన అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..