యాత్రీకుల భద్రత కోసం నడుం బిగించిన సౌదీ సివిల్ డిఫెన్స్
- May 20, 2019మక్కా: మక్కా సివిల్ డిఫెన్స్, సిటీలో యాత్రీకుల భద్రత నిమిత్తం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్స్‌తో ముందుకొస్తోంది. పవిత్ర రమదాన్ మాసంలో యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా వుండేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు మక్కా సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ - సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఫవ్వాజ్ బిన్ ఇబ్రహీమహ& అల్ జాయిది చెప్పారు. మొత్తం 5,775 లైసెన్సుల్ని ఈ ఏడాది ఇప్పటిదాకా మంజూరు చేయడం జరిగిందనీ, ఇందులో 635 హోటల్ అలాగే ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్, 228 రెస్టారెంట్ లైసెన్సులు వున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 2,140 ఇన్స్పెక్షన్స్ జరిగాయని అధికారులు వివరించారు. ఎప్పటికఫ్పుడు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా యాత్రీకుల భద్రతపై అప్రమత్తం చేస్తున్నట్ల తెలిపారు అధికారులు. ఫైర్ సేఫ్టీ మరియు ఎవాక్యుయేషన్కి సంబంధించిన వివరాల్ని కూడా టీవీలలో తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం