పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డ్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించిన యూఏఈ
- May 22, 2019
యూఏఈ:ఎంపిక చేసిన వ్యక్తులకు పర్మనెంట్ రెసిడెన్సీ డాక్యుమెంట్స్ అందించే ప్రక్రియను యూఏఈ ప్రారంభించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ ఇన్ దుబాయ్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ జనరల్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచనల మేరకు పర్మనెంట్ రెసిడెన్సీ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఎకానమీ మ్యాప్‌లో ఈ 'గోల్డెన్ కార్డ్' యూఏఈని మరో మెట్టు పైకెక్కిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంలో యూఏఈ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారాయన. 70 దేశాలకు చెందిన 6,800 మంది వలసదారులకు పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డెన్ కార్డ్ అందించనున్నట్లు వివరించారు జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన