విమానాన్ని ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి.. 15 ఏళ్ల బాలికతో మిలియనీర్..
- May 22, 2019
అతడు అమెరికాకు చెందిన మల్టీ మిలియనీర్.. సంఘంలో మంచి పేరున్న కోటీశ్వరుడు. పేదల పాలిట పెన్నిధి. సొంతంగా విమానాలు కొని, వాటిని పేదల అవసరాల నిమిత్తం ఉచితంగా ఇస్తూ ‘ఎయిర్ లైఫ్ లైన్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ముగ్గురు పిల్లలకు తండ్రి కూడా అయిన 53 ఏళ్ల స్టీఫెన్ బ్రాడ్లీ మెల్ విమానం గాల్లో ఉండగా ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి 15 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేశాడు. కుమార్తెకు ప్లయింగ్ పాఠాలు నేర్పించమని ఓ తల్లి స్టీఫెన్‌ను కోరింది. మొదట్లో బాగానే ఉన్నా రాను రాను అతడి బుద్ది వక్రించింది.
తన ప్రవేట్ జెట్ విమానంలో సోమర్ సెట్ నుంచి బ్రాంస్టేబుల్ వరకు ప్రయాణించిన స్టీఫెన్ తిరుగు ప్రయాణంలో విమానాన్ని ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి శృంగారంలో మునిగిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్టీఫెన్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరాన్ని ఒప్పుకున్న స్టీఫెన్‌కు అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పింది. కానీ స్టీఫెన్ తరపు న్యాయవాది.. తన క్లయింట్ సంఘంలో ఎంతో మంచి పేరున్న వ్యక్తి అని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని అతన్ని క్షమించి వదిలేయమంటూ కోర్టుని అభ్యర్థిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







