ఆన్లైన్ వీసా స్కామ్‌పై ఒమన్ ఇండియన్ ఎంబసీ వార్నింగ్
- May 23, 2019
మస్కట్: వీసాలు ఇస్తామని చెబుతూ ఫేక్ వెబ్సైట్ ద్వారా అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నట్లు ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలతో కూడిన సూచనల్ని జారీ చేసింది. ఇండియన్ వీసా కోసం అప్లయ్ చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా వుండాలని అధికారులు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ వెబ్సైట్ అయిన ఇండియన్వీసాఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఇండియన్ ఇ-వీసాని విదేశీయులకు అక్రమ మార్గాల్లో మంజూరు చేసేందుకు థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ హెచ్చరిక చేస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా ఫేక్ వెబ్సైట్ల వివరాల్నీ పేర్కొంది. ఈవీసాటుఇండియా, ఈవీసాఇండియా, ఇండియన్వీసాసర్వీస్, ఇండియాఇమ్మిగ్రేషన్, ఇవిసీఆఇండియా ఆర్గ్, ఇండియాఆన్లైన్వీసాఆర్గ్, ఇండియాఈవిసాఆర్గ్ వంటి వెబ్సైట్లతో జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!