షార్జాలో 225 దిర్హామ్‌లతో అన్‌లిమిటెడ్‌ బస్‌ రైడ్‌

షార్జాలో 225 దిర్హామ్‌లతో అన్‌లిమిటెడ్‌ బస్‌ రైడ్‌

225 దిర్హామ్‌ల ఖర్చుతో యూఏఈలో అన్‌లిమిటెడ్‌ బస్‌ రైడ్స్‌ పొందవచ్చు. షార్జా రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఈ వారం ఈ స్పెషల్‌ ప్రోమో కార్డ్‌ని లాంఛ్‌ చేసింది. 'మోవసలాట్‌ కార్డ్‌' పేరుతో దీన్ని లాంఛ్‌ చేశారు. 'మోవాసాలాట్‌' అంటే అరబిక్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ అని అర్థం. షార్జా సిటీ పరిధిలో 225 దిర్హామ్‌లు చెల్లించి నెల రోజులపాటు అపరిమితంగా బస్సుల్లో తిరగడానికి వీలు కల్పిస్తుంది ఈ కార్డ్‌. అయితే ఈ కార్డ్‌ ఇంటర్‌సిటీ బస్‌ రూట్స్‌కి పనిచేయదు. ఈ కార్డ్‌ కోసం ముందుగా 5 దిర్హామ్‌లు చెల్లించాల్సి వుంటుంది. ప్రతిరోజూ బస్‌ వినియోగించేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుందని అధికారులు అంటున్నారు. 

 

Back to Top