ఆన్‌లైన్‌ వీసా స్కామ్‌పై ఒమన్‌ ఇండియన్‌ ఎంబసీ వార్నింగ్‌

ఆన్‌లైన్‌ వీసా స్కామ్‌పై ఒమన్‌ ఇండియన్‌ ఎంబసీ వార్నింగ్‌

మస్కట్‌: వీసాలు ఇస్తామని చెబుతూ ఫేక్‌ వెబ్‌సైట్‌ ద్వారా అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నట్లు ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీ హెచ్చరికలతో కూడిన సూచనల్ని జారీ చేసింది. ఇండియన్‌ వీసా కోసం అప్లయ్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, ఫేక్‌ వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తగా వుండాలని అధికారులు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌ అయిన ఇండియన్‌వీసాఆన్‌లైన్‌ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఇండియన్‌ ఇ-వీసాని విదేశీయులకు అక్రమ మార్గాల్లో మంజూరు చేసేందుకు థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్స్‌ ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ హెచ్చరిక చేస్తున్నట్లు ఇండియన్‌ ఎంబసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా ఫేక్‌ వెబ్‌సైట్ల వివరాల్నీ పేర్కొంది. ఈవీసాటుఇండియా, ఈవీసాఇండియా, ఇండియన్‌వీసాసర్వీస్‌, ఇండియాఇమ్మిగ్రేషన్‌, ఇవిసీఆఇండియా ఆర్గ్‌, ఇండియాఆన్‌లైన్‌వీసాఆర్గ్‌, ఇండియాఈవిసాఆర్గ్‌ వంటి వెబ్‌సైట్లతో జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచించారు. 

Back to Top