రస్‌ అల్‌ ఖైమాలో రెండు వారాల్లో 18 మంది బెగ్గర్స్‌ పట్టివేత

రస్‌ అల్‌ ఖైమాలో రెండు వారాల్లో 18 మంది బెగ్గర్స్‌ పట్టివేత

రస్‌ అల్‌ ఖైమా:మొత్తం 18 మంది బెగ్గర్స్‌ని రెండు వారాల్లో రస్‌ అల్‌ ఖైమా పోలీసులు పట్టుకున్నారు. ఎమిరేట్‌లోని వివిధ ప్రాంతాల్లో వీరిని పట్టుకోవడం జరిగింది. పవిత్ర రమదాన్‌ మాసంలో బెగ్గర్స్‌ కారణంగా తలెత్తే సమస్యల్ని అరికట్టడానికి వీరిని పట్టుకోవడం జరుగుతూ వస్తోంది. వీరిలో కొందరు విజిట్‌ వీసాపై వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేకమైన క్యాంపెయిన్‌ ద్వారా వీరిని అదఱుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ ఆపరేషన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్లా అల్‌ మెనాక్స్‌ చెప్పారు. క్రిమినల్‌ ఇన్వెస్టగేషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఎమిరేట్‌లోని అన్ని పోలీస్‌ స్టేషన్స్‌ సంయుక్తంగా యాంటీ బెగ్గింగ్‌ డ్రైవ్‌ చేపడుతున్నాయి. ప్రత్యేకంగా పెట్రోల్స్‌ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు.    

Back to Top