రస్ అల్ ఖైమాలో రెండు వారాల్లో 18 మంది బెగ్గర్స్ పట్టివేత
- May 23, 2019
రస్ అల్ ఖైమా:మొత్తం 18 మంది బెగ్గర్స్‌ని రెండు వారాల్లో రస్ అల్ ఖైమా పోలీసులు పట్టుకున్నారు. ఎమిరేట్‌లోని వివిధ ప్రాంతాల్లో వీరిని పట్టుకోవడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసంలో బెగ్గర్స్ కారణంగా తలెత్తే సమస్యల్ని అరికట్టడానికి వీరిని పట్టుకోవడం జరుగుతూ వస్తోంది. వీరిలో కొందరు విజిట్ వీసాపై వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేకమైన క్యాంపెయిన్ ద్వారా వీరిని అదఱుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ మెనాక్స్ చెప్పారు. క్రిమినల్ ఇన్వెస్టగేషన్ డిపార్ట్మెంట్, ఎమిరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్స్ సంయుక్తంగా యాంటీ బెగ్గింగ్ డ్రైవ్ చేపడుతున్నాయి. ప్రత్యేకంగా పెట్రోల్స్‌ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!