తెలంగాణ:విద్యార్థులకు గుడ్ న్యూస్..
- May 25, 2019తెలంగాణ:వేసవి సెలవులు ఇచ్చారని ఊరికి వెళ్లి ఉంటారు. ఎండలు మండి పోతున్నాయని అమ్మమ్మా, తాతయ్యా బయటకు వెళ్లనివ్వట్లేదేమో. మరి స్కూలు ఇప్పుడే ఓపెన్ చేస్తే ఎలా వెళ్తారని బడికి కూడా హాలిడేస్ పొడిగించేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకు పొడిగించింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం (మే24) అధికారిక ప్రకటన విడుదల చేసింది. అసలైతే జూన్ 1నుంచి స్కూల్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంది. రాష్రంలోని అన్ని పాఠశాలలు ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున 11 వరకు సెలవులు ఇచ్చి 12 నుంచి స్కూల్స్ తెరవాలని పాఠశాలలకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ