తెలంగాణ:విద్యార్థులకు గుడ్ న్యూస్..
- May 25, 2019
తెలంగాణ:వేసవి సెలవులు ఇచ్చారని ఊరికి వెళ్లి ఉంటారు. ఎండలు మండి పోతున్నాయని అమ్మమ్మా, తాతయ్యా బయటకు వెళ్లనివ్వట్లేదేమో. మరి స్కూలు ఇప్పుడే ఓపెన్ చేస్తే ఎలా వెళ్తారని బడికి కూడా హాలిడేస్ పొడిగించేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకు పొడిగించింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం (మే24) అధికారిక ప్రకటన విడుదల చేసింది. అసలైతే జూన్ 1నుంచి స్కూల్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంది. రాష్రంలోని అన్ని పాఠశాలలు ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున 11 వరకు సెలవులు ఇచ్చి 12 నుంచి స్కూల్స్ తెరవాలని పాఠశాలలకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







