ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
- May 25, 2019
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్..ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాడు. ఈనెల 30న ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించనున్నారు జగన్. అందుకు ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్‌తో మర్యాదపూర్వంగా భేటీ కానున్నారు. ఈనెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అనంతరం కేటీఆర్‌తో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
కేసీఆర్ భేటీ కంటే ముందే రాజ్‌భవన్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌ను కలవనున్నారు జగన్. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన వైసీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నట్టు వైసీపీ ఎల్పీ ఆమోదించిన తీర్మాణాన్ని గవర్నర్‌కు అందించనున్నారు జగన్.
కాసేపట్లో తాడేపల్లిలో జగన్ క్యాంప్ ఆఫీస్‌లో వైసీపీఎల్పీ భేటీ కానుంది. శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్‌ను లాంఛనంగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. అనంతరం ఎమ్మెల్యేలు ఆమోదించిన తీర్మాణాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు. సాయంత్రం 4గంటలకు గవర్నర్‌తో జగన్ భేటీ అవుతారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







