మహిళకు సాయం చేస్తానని చెప్పి పర్స్‌ చోరీ చేసిన వ్యక్తి

మహిళకు సాయం చేస్తానని చెప్పి పర్స్‌ చోరీ చేసిన వ్యక్తి

యూ.ఏ.ఈ:ఇసుకలో తన వాహనం కూరుకుపోగా సాయం కోసం ఎదురుచూస్తోన్న ఓ మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి, ఆమె పర్స్‌ని దొంగిలించాడో మోసగాడు. షార్జాలో జరిగింది ఈ ఘటన. ప్యాసింజర్‌ సీట్‌లో మహిళ పర్స్‌ని చూసిన ఆ వ్యక్తి, దాని మీద ఓ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ని వుంచి, మహిళ దృష్టిని మరల్చాడు కారుని ముందుకు తోస్తున్నట్లుగా నటిస్తూ. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ఆ మహిళ తేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. కేసు విచారణ జూన్‌ 16వ తేదీకి వాయిదా పడింది. 

Back to Top