కార్డియాక్‌ కేథటరైజేషన్‌ ఫీజు నుంచి వలసదారులకు ఊరట

కార్డియాక్‌ కేథటరైజేషన్‌ ఫీజు నుంచి వలసదారులకు ఊరట

కువైట్‌: మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ బస్సెల్‌ అల్‌ సబా, మినిస్టీరియల్‌ డిక్రీని విడుదల చేశారు. ఈ డిక్రీ ప్రకారం ఎక్యూర్‌ హార్ట్‌ ఎటాక్‌, హై రిస్క్‌ ఎంఎస్‌టిఇఎంఎల్‌ మరియు ఎస్‌టిఇఎంఐ - ఫ్రమ్‌ కార్డియాక్‌ కేథటరైజేషన్‌ వంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఫీజు నుంచి వలసదారులకు ఉపశమనం లభిస్తుంది. డెసిషన్‌ రెండో ఆర్టికల్‌ ప్రకారం సంబంధిత ఫామ్‌, ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న ఫిజీషియన్‌, హెడ్‌ ఆఫ్‌ ది యూనిట్‌, హెడ్‌ ఆఫ్‌ ది కన్సెర్న్‌డ్‌ మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ సూచన మేరకు కేసుల్ని ఉచితంగా ట్రీట్‌ చేస్తారు. ఇదిలా వుంటే, జబెర్‌ హాస్పిటల్‌ హెడ్‌ ఆఫ్‌ సర్జరీ డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ సల్మాన్‌ అల్‌ జబా, 200కి పైగాసర్జికల్‌ ఆపరేషన్స్‌ని జనవరి నుంచి ఇప్పటిదాకా నిర్వహించారు. 

Back to Top