ఇరాన్ను అడ్డుకునేందుకు అరబ్ దేశాలకు ఆయుధ విక్రయాలు
- May 26, 2019
వాషింగ్టన్/టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో ఇరాన్ దూకుడును అడ్డుకునేందుకు అరబ్ దేశాలకు 800 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ఆయుధ ఎగుమతుల నియంత్రణా చట్టం పరిధిలో 810 కోట్ల డాలర్ల విలువైన ఆయుధసామగ్రి, బాంబులు, క్షిపణులతోపాటు సైనికదళాలను సౌదీ అరేబియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లకు పంపుతున్నట్లు ఆయన శనివారం ఇక్కడ తెలిపారు. గల్ఫ్, మధ్యప్రాచ్యంలో ఇరాన్ దుస్సాహసాన్ని అడ్డుకునేందు కు సాధ్యమైనంత త్వరలో ఈ ఆయుధాలను, సైనిక దళాలను అక్కడికి తరలిస్తా మని చెప్పారు.ఈ నిర్ణ యాన్ని వ్యతిరేకించిన డెమొక్రాటిక్ ప్రతినిధి క్రిస్ మర్ఫీ 'ఈ ప్రతిపా దనను అమెరికన్ కాంగ్రెస్ తిరస్కరిస్తుందని తెలిసే అధ్యక్షుడు దొడ్డిదోవను ఎంచుకున్నారని, ఈ బాంబులను వారికి విక్రయించాల్సి నంత అత్యవసర స్థితి ఏమీ లేదని అన్నారు.
మధ్యప్రాచ్యంలోకి వస్తున్న అమెరికా యుద్ధనౌకలపై ప్రయోగించేందుకు తాము అత్యాధునిక ఆయుధాలను సిద్ధం చేస్తున్నామని ఇరాన్సైనికాధికారి జనరల్ మోర్తజా కుర్బానీ చెప్పారు. 'మూర్ఖంగా వ్యవహరిస్తే తాము అమెరికా యుద్ధ నౌకలు, విమానాలను సిబ్బందితోసహా సముద్రంలో ముంచేస్తామని ఆయన హెచ్చరించారు. ఇందుకు తమకు రెండు క్షిపణులు లేదా రెండు రహస్య ఆయుధాలు సరిపోతాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







