5జి నెట్వర్క్: ఎటిసలాట్ తొలి మెనా నెట్వర్క్
- May 30, 2019
యూ.ఏ.ఈ:ఎట్టకేలకు యూఏఈలో 5జి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. టెలికామ్ ఆపరేటర్ ఎటిసలాట్, ఇకపై యూఏఈలో వినియోగదారులు 5జి నెట్వర్క్ని పొందవచ్చునని ప్రకటించింది. ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండా 5జి రెడీ జెడ్‌టిఇ యాక్సన్ 10 ప్రో ద్వారా ఈ కొత్త అనుభూతిని పొందడానికి వీలుంది. 4జితో పోల్చితే 20 రెట్లు వేగంతో 5జి సేవలు వినియోగదారులకు గొప్ప అనుభూతినివ్వనున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అత్యంత వేగంతో కూడిన నెట్వర్క్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎటిసలాట్ పేర్కొంది. యాక్సాన్ 10 ప్రో కొనుగోలు కోసం మూడు ఆప్షన్స్‌ని ఎటిసలాట్ వినియోగదారుల ముందుంచింది. వీటిల్లో స్ట్రెయిట్ పేమెంట్ కింద 5,555 దిర్హామ్‌లు చెల్లించవచ్చు. అలాగే, 12, 18, 24 నెలల ఇన్స్టాల్మెంట్స్ ప్రాతిపదికన 473, 318, 241 దిర్హామ్‌లు చెల్లించడానికీ అవకాశం కల్పిస్తున్నారు. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







