కార్ల మార్కెట్ తరలింపు తో ఊపిరి పీల్చుకొన్న స్థానికులు
- January 03, 2016
అబూ షగర వాసులకు శుభవార్తతో కొత్త ఏడాది ప్రారంభమైంది. 2016 తొలిరోజునే ఉపయోగించబడని 370 కార్లను , ఆ ప్రాంతం నుంచి తరలించడంతో అబూ షగర ఇపుడు ఒక సుందరమైన నూతన శోభను సంతరించుకొంది. గత ఏడాది డిసెంబర్ 31 వ తెదే ఈ కార్ల తొలగింపునకు చివరి రోజుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం స్థానికులకు విదితమే, గత 20 ఏళ్ళుగా అబూ షగర ప్రాంతవాసులకు ఈ గందరగోళ పార్కింగులు ఎంతో చికాకును కల్గిస్తుంది. ఇక్కడ నెలకొని ఉన్న అసౌకర్యాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. " అమ్మకానికి కారు " అంటూ రాసి ఉన్న బోర్డులు పలు దుకాణాలు గజిబిజీగా ఉండేవి. అంతేకాకుండా, వివిధ కార్ల ఏజెంట్లు " కారు కొనండి...కారు కొనండి "
అని బిగ్గరగా కేకలు పెట్టేవారు. ప్రభుత్వం తీసుకొన్న ఒక మంచి నిర్ణయం కారణంగా, ప్రస్తుతం ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా , సుందరంగా రూపుదిద్దుకొంది. అబూ షగర నివాసితులు గతంలో తాము పడుతున్న ఇబ్బందుల గూర్చి షార్జా ప్రభుత్వానికి ఇచ్చిన పిర్యాఢులకు స్పందన రావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







