కువైట్ లో ఘనంగా 'తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ' వేడుకలు

- June 03, 2019 , by Maagulf
కువైట్ లో ఘనంగా 'తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ' వేడుకలు

కువైట్: కువైట్ లో జాగృతి బృందం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా ఆదివారం 02.06.2019 నాడు నిర్వహించడం జరిగింది. కువైట్ జాగృతి ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని అన్నారు. ముఖ్యంగా 60 ఏళ్ళ కాలం పాటు వెనుకబాటుకు గురి అయినా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే అమరవీరులకు మనము ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనేక సమీకరణాల మధ్య,ఎన్నో ఆత్మ బలిదానాల నడుమ , తెలంగాణ  పితామహుడు , ఉద్యమ రధసారథి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ  అవతరించి నేటికి ఐదు వసంతాలు పూర్తి  చేసుకుంది.ఈ వేడుకలో వైస్ ప్రెసిడెంట్  విస్డం ఆచారి గన్నరపు, విజయ నాయర్, జనరల్ సెక్రటరీ మార్క ప్రమోద్ కుమార్, జాయింట్ సెక్రెటరీ రాజన్న మామిడిపల్లి, రాజశేఖర్ వరం, రమేష్ కుమార్ చిలివేరి, జనగాం  చార్లీ , సైఫుద్దీన్, నారాయణ దారంగుల పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com