కువైట్ లో ఘనంగా 'తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ' వేడుకలు
- June 03, 2019
కువైట్: కువైట్ లో జాగృతి బృందం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా ఆదివారం 02.06.2019 నాడు నిర్వహించడం జరిగింది. కువైట్ జాగృతి ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని అన్నారు. ముఖ్యంగా 60 ఏళ్ళ కాలం పాటు వెనుకబాటుకు గురి అయినా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే అమరవీరులకు మనము ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనేక సమీకరణాల మధ్య,ఎన్నో ఆత్మ బలిదానాల నడుమ , తెలంగాణ పితామహుడు , ఉద్యమ రధసారథి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అవతరించి నేటికి ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ వేడుకలో వైస్ ప్రెసిడెంట్ విస్డం ఆచారి గన్నరపు, విజయ నాయర్, జనరల్ సెక్రటరీ మార్క ప్రమోద్ కుమార్, జాయింట్ సెక్రెటరీ రాజన్న మామిడిపల్లి, రాజశేఖర్ వరం, రమేష్ కుమార్ చిలివేరి, జనగాం చార్లీ , సైఫుద్దీన్, నారాయణ దారంగుల పాల్గొన్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







