విస్తారా ఎయిర్‌లైన్స్ నుంచి అంతర్జాతీయ సేవలు
- June 03, 2019
ఢిల్లీ: దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ విస్తారా త్వరలో అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం. విస్తారా గ్రూప్ సంస్థ ఐఏటీఏ వార్షిక జనరల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో లెస్లీ థంగ్ మాట్లాడుతూ.. 'విమానయాన రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్. సుదీర్ఘకాలం ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నాం. 2019 రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నాం' అని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు.
టాటాసన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా 2015 జనవరిలో విస్తారా ఎయిర్‌లైన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం విస్తారా వద్ద 22 విమానాలు ఉన్నాయి. వారానికి 850 విమాన సర్వీసులను అందిస్తోంది. మరో నాలుగు బోయింగ్ 737-800 ఎన్జీ, రెండు ఏ320 నియో విమానాలను లీజుకు తీసుకుంటున్నట్లు గత నెల విస్తారా ప్రకటించింది. దీంతో పాటు మరో 50 ఎయిర్‌బస్ విమానాలకు గతేడాది ఆర్డర్ ఇచ్చింది. 2023 నాటికి ఈ విమానాలు విస్తారా చేతికి రానున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..