కమెడియన్ దిన్యర్ కాంట్రాక్టర్ కన్నుమూత
- June 05, 2019
ప్రముఖ నటుడు, కమెడియన్ దిన్యర్ కాంట్రాక్టర్(79) ముంబయిలో ఈ ఉదయం కన్నుమూశారు. వృద్ధ్యాప్య కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వర్లీ శ్మాశనవాటికలో నేడు అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపారు. దిన్యర్ హాస్య నటనకు పెట్టింది పేరు. 2001లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ చోరీ చోరీ చుప్కే చుప్కేలో హోటల్ మేనేజర్‌గా, అక్షయ్ కుమార్ మూవీ కిలాడీలో ప్రిన్సిపల్ పాత్రలో, షారుక్ ఖాన్ నటించిన బాద్షాలో క్యాసినో మేనేజర్‌గా వేసిన పాత్రలు దిన్యర్కు బాగా ప్రాచుర్యం కల్పించాయి. గుజరాత్, హిందీ నాటక రంగంతో అనుబంధం కలవాడు. ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దిన్యర్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. నాటకరంగమైన, టీవీయైన, సినిమాలైన తన నటనతో ఎంతో మంది ముఖాల్లో చిరునవ్వులు పూయించిన వ్యక్తిగా కొనియాడారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..