అతి వేగంపై దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- June 08, 2019
దుబాయ్‌లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం 17 మందిని బలి తీసుకున్న ఘటన నేపథ్యంలో దుబాయ్ పోలీస్, వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు అతి వేగానికి సంబంధించి. అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతున్న దరిమిలా, వాహనదారులు పరిమిత వేగంతో మాత్రమే తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని హెచ్చరించారు పోలీసులు. అతి వేగంతో వాహనాలు ప్రయాణిస్తే, వాహనదారులపై కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామన్నారు. దుబాయ్‌లోని అల్ రష్దియాలో అతి వేగంతో దూసుకొచ్చిన ఓ బస్సు హైట్ రిస్ట్రిక్షన్ బ్యారియర్‌ని ఢీకొనడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. బ్యారియర్ 2.2 మీటర్ల ఎత్తులో వుండగా, అంతకంటే ఎక్కువ ఎత్తున్న బస్సులు ఈ మార్గంలో ప్రయాణించడానికి లేదు. అయితే, మవసలాట్కి చెందిన బస్సు అతి వేగంతో దూసుకొచ్చి ఈ బ్యారియన్ని ఢీకొంది. మస్కట్ - దుబాయ్ మధ్య తిరిగే బస్సు ఇది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..