ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత
- June 10, 2019
బెంగళూరు : ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. రచయితగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు ఆయనకు వరించింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది.
గిరీష్ కర్నాడ్ పూర్తి పేరు గిరీష్ రఘునాత్ కర్నాడ్. 1938లో మే 19న మహారాష్ట్రలోని మథేరన్ ప్రాంతంలో జన్మించారు. నలభై ఏళ్ల సినీ కెరీర్లో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగులో 'ధర్మచక్రం', 'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'కొమరం పులి' చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా కన్నడ, హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. గిరీష్ చివరిగా నటించిన చిత్రం 'అప్నా దేశ్'. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..