విజయవాడ నుంచి సింగపూర్ ఇండిగో విమాన సర్వీసులు ఆగిపోతాయా?!కారణాలేంటి?
- June 10, 2019
విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇక గ్రౌండ్ కే పరిమితం కానున్నాయా? జులై 2 నుంచి ఇండిగో సర్వీసులు ఆగిపోతాయా. సాంకేతిక కారణాలతో సర్వీసులు రద్దు చేస్తారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. రిజర్వేషన్ కోసం ప్రయాణీకులు ప్రయత్నిస్తుండగా.. జులై 2 తర్వాత సీట్లు చూపించడం లేదు. విజయవాడ నుంచి ఇండిగో సంస్థ 180 సీటర్ విమానాలు సింగపూర్ కు రోజూ నడిపిస్తోంది. ప్రస్తుతం ఎయిర్లైన్స్ వ్యాపారంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్వీసులు ఆపడం మేలని భావించినట్టు ఎయిర్ పోర్ట్ వర్గాలంటున్నాయి. కనీసం 265 సీట్లు నిండితేనే కంపెనీకి నష్టం రాకుండా ఉంటుందని ఆ రంగ నిఫుణులు అంటున్నారు. కానీ మినిమం అక్యుపెన్సీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని సంబంధిత ఎయిర్ లైన్స్ లేదంటే పౌరవిమానయాన సంస్థ కన్ఫామ్ చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..