భారత్ - మయన్మార్ సరిహద్దులో భూకంపం
- January 03, 2016
భారత్ - మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8 గా నమోదయింది. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో భూ ప్రకంపనలు తీవ్రంగా సంభవించాయి. భూకంపం తెల్లవారుఝామున 4 గంటల 35 నిమిషాలకు సంభవించింది. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు పరిస్థితిని సమీక్షించారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం సీఎంలతో ప్రధాన మంత్రి మోడీ నేరుగా ఫోన్ చేసి సంభాషించారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన వారికి..గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేరుకొనేందుకు పయనమయ్యారు. భూకంప తీవ్రతకి ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, కోల్‌కతాలో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఇంఫాల్‌కు 33 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. భూ కంప తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఇంకా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే సిలిగురిలో బస చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భూకంపం సంభవించినట్లు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు తీశారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







