నైజీరియన్ చేతిలో మోసపోయిన తెలుగు హీరోయిన్..
- June 12, 2019
టెక్నాలజీ పెరిగింది.. దాంతో పాటు మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాంగ్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి అని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తుకున్నా సదరు వ్యక్తి మాటల వలలో చిక్కుకుపోతోంది యువత. ఫలితంగా డబ్బులు గుల్ల. ముఖ్యంగా నైజీరియన్ ముఠాలు అనేక మందికి ఫోన్లు చేసి బ్యాంకు వివరాలు అడిగి తెలుసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఆన్లైన్ పరిచయంతో నమ్మబలికిన కొందరు విదేశీ వ్యక్తులు మీకు గిప్టులు పంపాము. ఎయిర్ పోర్టులో ట్యాక్స్ కట్టి బహుమతులు తీసుకోండి అంటూ మరో రకమైన మోసానికి పాల్పడుతున్నారు. ఈ లిస్టులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. తాజాగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న సోనాక్షి వర్మ అనే హీరోయిన్ని నైజీరియన్ ముఠా దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆమె ఫేస్బుక్ ఖాతాకు మే నెలలో మెర్రిన్ కిర్రాక్ పేరుతో ఓ రిక్వెస్ట్ రాగా.. దాన్ని యాక్సెప్ట్ చేసింది సోనాక్షి. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం రోజూ ఛాటింగ్ చేసుకునే వరకు వెళ్లింది. మెర్రిన్ తన వ్యక్తిగత వివరాలన్నీ సోనాక్షి చెబుతుండేవాడు. తాను లండన్లో ఉంటున్నానని, మీ తో స్నేహం చేయాలని ఉందని చెప్పడంతో సోనాక్షి అంగీకరించింది. ఇలా సాగుతున్న వారి వ్యవహారం.. ఓ రోజు తమ స్నేహానికి గుర్తుగా గిప్ట్ పంపిస్తున్నానన్నాడు మెర్రిన్. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్కు వస్తుందని చెప్పాడు. ఈ క్రమంలోనే మే 27న ఓ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారిని అని అన్నాడు. మెర్రిన్ నుంచి మీకు బహుమతి వచ్చింది. దాన్ని హైదరాబాద్కు పంపాలంటే రూ.85 వేలు కట్టమని చెప్పాడు. అతడి మాటలు నమ్మి అధికారినని చెప్పిన వ్యక్తి ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసింది సోనాక్షి. వారం రోజులైనా గిప్ట్ పత్తాలేదు. అప్పటికి గాని తాను మోసపోయానని గుర్తించి సోనాక్షి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..