కారులోంచి చెత్త విసిరేస్తే 1,000 జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్స్‌

- June 13, 2019 , by Maagulf
కారులోంచి చెత్త విసిరేస్తే 1,000 జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్స్‌

అబుదాబీ పోలీసులు, క్యాపిటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ని కాపాడే విషయంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కారులోంచి చెత్తని రోడ్లపై విసిరేసేవారికి 1000 దిర్హామ్‌ల జరీమానాతోపాటు, 6 బ్లాక్‌ పాయింట్స్‌ కూడా విధిస్తామని పేర్కొన్నారాయన. డ్రైవర్‌ లేదా ప్యాసింజర్‌ ఈ చర్యలకు పాల్పడినా, వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు అబుదాబీ పోలీసులు. ట్రాఫిక్‌ పెట్రోల్స్‌, స్మార్ట్‌ సిస్టమ్స్‌ ఎప్పటికప్పుడు వాహనదారుల బిహేవియర్‌ని గమనిస్తాయని ఉల్లంఘనుల్ని గుర్తించడం జరుగుతుందని అబుదాబీ పోలీసులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com