పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించండి:ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- June 14, 2019
న్యూ ఢిల్లీ:నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు సూచించారు. తన నివాసానికి వచ్చిన కేంద్రమంత్రికి… ప్రాజెక్టు కు సంబంధించిన వివరాలు తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందించాలని వెంకయ్య కోరారు.
గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి.. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లోని కరవు ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఆ మొత్తాన్ని నాబార్డు ద్వారా విడుదల చేయించేందుకు అవసరమైన చొరవ తీసుకోవాలన్నారు వెంకయ్య.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!