ఘర్షణల్లో నిర్వాసితులైన 18 వేల కుటుంబాలు

- June 14, 2019 , by Maagulf
ఘర్షణల్లో నిర్వాసితులైన 18 వేల కుటుంబాలు

ట్రిపోలీ దక్షిణ ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణలు, పోరాటాలలో దాదాపు 18 వేలకు పైగా కుటుంబాలు (94 వేల మంది) నిర్వాసితులయ్యాయని ఐరాసకు చెందిన వలస వ్యవహారాల అంతర్జాతీయ సంస్థ (ఐఒఎం) వెల్లడించింది. నిర్వాసితుల్లో దాదాపు 48 శాతం మంది 18 ఏళ్లలోపు చిన్నారులేనని, వీరిలో దాదాపు 3,900 మందికి పైగా నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్న శరణార్థి శిబిరాలలో నివశిస్తున్నారని ఐఒఎం తన ప్రకటనలో వివరించింది. ఘర్షణల సమీప ప్రాంతాలకు వెళ్లే వారికి ఇప్పటికీ ముప్పు పొంచి వున్నదని ఈ సంస్థ హెచ్చరించింది. మార్షల్‌ ఖలీఫా హఫ్తార్‌ నేతృత్వంలోని లిబియన్‌ నేషనల్‌ ఆర్మీ గత ఏప్రిల్‌ 4న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించటంతో సాయుధ ఘర్షణలు ప్రారంబమయ్యాయి. అప్పటి నుండి ట్రిపోలీ దక్షిణ ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు కొనసాగుతూనే వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com