రెండు హౌతీ డ్రోన్స్‌ని కూల్చేసిన సౌదీ ఎయిర్‌ డిఫెన్సెస్‌

- June 18, 2019 , by Maagulf
రెండు హౌతీ డ్రోన్స్‌ని కూల్చేసిన సౌదీ ఎయిర్‌ డిఫెన్సెస్‌

సౌదీ అరేబియా:కోలిషన్‌ ఎయిర్‌ డిఫెన్సె ఫోర్సెస్‌ విజయవంతంగా రెండు డ్రోన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లను కూల్చివేయడం జరిగింది. ఇరాన్‌ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల్ని అభా ప్రాంతం వైపు సంధించగా, వాటిని కూల్చివేసినట్లు కోలిషన్‌ అధికార ప్రతినిథి చెప్పారు. ఈ విషయాన్ని సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ వెల్లడించింది. పేలుడు పదార్థాల్ని కలిగిన డ్రోన్లను హౌతీ మిలీషియా, సౌదీ కింగ్‌డమ్‌ వైపు పంపించిందని చెప్పారు. అభా వైపు గత వారంలో పలు డ్రోన్లను తీవ్రవాదులు సంధించగా, ఎయిర్‌ పోర్ట్‌పై జరిగిన ఓ దాడిలో 26 మంది గాయపడిన సంగతి తెల్సిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com