1000 మంది చిన్నారుల గుండె చప్పుళ్లు విన్న మహేష్ బాబు
- June 18, 2019
సమాజానికి ఎంతో కొంత చేయాలి లేకపోతే లావైపోతాం అన్న శ్రీమంతుడి సినిమాలోని డైలాగ్‌ని అక్షరాలా ఆచరిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. రీల్ లైఫ్‌లో సామాజిక సమస్యలను ఎత్తి చూపుతూ వాటినే ప్రధానాంశంగా తీసుకుని సినిమాలు చేసే మహేష్.. రియల్ లైఫ్‌లో వాటి పరిష్కార మార్గంలో భాగస్వాములవుతున్నారు. గత మూడున్నరేళ్లలో ఆయన వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించారు. మహేశ్‌తో కలిసి ఆంధ్రా హాస్పిటల్ వివిధ గ్రామాల్లో 18 క్యాంప్‌లు నిర్వహించి చిన్నారులకు ఆపరేషన్లు చేయించింది. ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆంద్రా హాస్పిటల్స్, బ్రిటన్‌కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన చర్యలు చేపట్టడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఓ మంచి పని కోసం తమకు సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మహేశ్ దంపతులు చేస్తున్న మంచి పనిని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..