దుబాయ్ లో దారుణం...తల్లిని క్షోభ పెట్టి చంపిన కొడుకు
- June 20, 2019
దుబాయ్: భార్యతో కలసి ఇండియా కు చెందిన ఓ వ్యక్తి తన సొంత తల్లినే చిత్రహింసలు పెట్టి చావుకు కారణమైన ఘటన దుబాయ్‌లో జరిగింది. చనిపోయేనాటికి తల్లి బరువు కేవలం 29 కేజీలు అని వైద్యులు వెల్లడించారు. పొరుగింటి లోని వ్యక్తి, హాస్పిటల్ లో పని చేస్తున్న ఈయన ఈ సంగతి తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన మాటల్లో "పక్కింట్లోని ఆవిడ ఉద్యోగానికి వెళ్తూ తమ కూతురిని మా ఇంట్లో ఉంచేది. ఇంట్లో మా అత్తగారు ఇండియా నుండి వచ్చారని, కానీ ఆవిడ మా అమ్మాయిని సరిగ్గా చూసుకోకపోవటం మూలంగా తరచూ సిక్ అవుతోందనీ, అందుచేత తమ కూతురిని మా ఇంట్లో ఉంచి తాను ఆఫీస్ కు వెళ్ళేది. మూడు రోజుల తర్వాత మేము ఒక వృద్దురాలిని పక్కింటి వాళ్ళ బాల్కనీలో పడుకొని ఉండటం చూసాం. ఆవిడ అర్ధ నగ్నంగా, వొళ్ళంతా కాలిన గాయాలు ఉండటం గమనించి వెంటనే సెక్యూరిటీ గార్డ్ కు సమాచారం తెలిపాము. వెంటనే సెక్యూరిటీ గార్డ్ సహాయంతో తలుపు తట్టి చూసేసరికి ఆమె నేలపై పడుకొని ఉందనీ, ఆమె స్థితి చాల దయనీయంగా ఉందనీ, ఆమెకు తక్షణం వైద్యం అవసరమని అంబులెన్సు కు ఫోన్ చేయటం జరిగింది. సిబ్బంది వచ్చి ఆమెను తరలించే ప్రయత్నం లో వృద్దురాలు ఆమె వొంటి మీద ఉన్న గాయాలతో ఎంతో బాధ అనుభవించారు. ఆమెను హాస్పిటల్ కు తరలిస్తుంటే ఆమె కుమారుడు వెంట వెళ్లేందుకు నిరాకరించాడనీ, సిబ్బంది కలుగజేసుకొని చెప్పగా అప్పుడు వెంట వెళ్ళాడు. ఆమెను అంబులెన్సు లోకి ఎక్కిస్తున్నప్పుడు కొడుకు సిబ్బందికి సహాయం చేయలేదనీ, ఇరుగుపొరుగు వారే సాయం అందించారు" అని తెలిపారు. తిండిపెట్టకుండా కడుపు మాడ్చి, శారీరకంగా హింసించడంతో ఆమె పక్కటెముకలు విరగడంతో అంతర్గత రక్తస్రావంతో ఆమె మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. ఆమె కంటి రెటీనాను పెరికివేయడంతో పాటు మరో కంటికి కూడా గాయం చేసినట్లు కోర్టు తెలిపింది. 2018 జూలై నుంచి అక్టోబర్ వరకూ ఈ హింస కొనసాగినట్లుగా అల్ కుసైస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు