ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెరగనున్న మోజు

- June 20, 2019 , by Maagulf
ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెరగనున్న మోజు

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. విద్యుత్ సహాయంలో నడిచే వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ మేరకు సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో వివరించింది. భారత్‌లోని ప్రధాన పట్టణాలలోకాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సాహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాల నుంచి వచ్చే పొగే ఎక్కువగా కాలుష్యానికి కారణమవుతుండడంతొ బ్యాటరీతో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. కాలుష్యం ఉద్గారాలు వెదజల్లని ఈవీ వాహనాల సంఖ్యను భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా 2030 నాటికి వాడకంలో విద్యుత్ వాహనాలే ఉండాలనే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించారు. మెుదటి అడుగులో భాగంగా విద్యుత్ ఆధారిత వాహనాల వైపు వాహనదారులు చూసేలా రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం ఎలాంటి చెల్లింపులు చేయనవసరం లేదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com