హెల్త్ వయోలేషన్స్: రెస్టారెంట్ మూసివేత
- June 21, 2019
అబుధాబి: అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అదాప్సా), అల్ సయ్యద్ రెస్టారెంట్ మరియు గ్రిల్‌ని మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అబుదాబీ పోర్ట్‌లో గల ఈ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలేదనే అభియోగాలు మోపబడ్డాయి. అదాఫ్సా కమ్యూనికేషన్స్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ థామెర్ రషెద్ అల్ కాసెమి మాట్లాడుతూ, పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతూ, అదాఫ్సా హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నందున రెస్టారెంట్‌ని మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. హెల్త్ వయోలేషన్స్ ఏమైనా రెస్టారెంట్స్‌లో కన్పిస్తే, అబుధాబి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చునని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!