'యోగా డే'లో పాల్గొన్న వేలాదిమంది ఔత్సాహికులు
- June 21, 2019
అబుధాబి: ఇండియన్ ఎంబసీ నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది రెసిడెంట్స్ పాల్గొన్నారు. ఉమ్ అల్ ఎమరాత్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మినిస్టర్ ఆఫ్ టోలరెన్స్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి యూఏఈ స్ట్రాంగ్ సపోర్టర్ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'వసుదైక కుటంబం' అనే భారత దేశ నినాదం చాలా గొప్పదని చెప్పారాయన. యోగా అనేది జీవన విధానమని వివరించారు మినిస్టర్. థెరప్యుటిక్ యోగా ఫర్ కోర్ స్ట్రెంగ్త్, ఫేస్ యోగా, రాజ యోగ, లాఫర్ యోగా, యోగా ఫర్ స్పైనల్ హెల్త్, హార్ట్ఫుల్నెస్ యోగా.. ఇలా రకరకాల యోగా ప్రక్రియల్ని ఆయా ప్రక్రియల్లో నిష్ణాతులు ప్రదర్శించి, వాటి ఫలితాల్ని తెలియజేశారు.
--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి),ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!