'ఆర్ఆర్ఆర్'కు ఆలియా భట్ రూపంలో మరో షాక్..!
- June 21, 2019
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ సినిమా షూటింగ్ ఏ ముహుర్తాన మొదలైందో గానీ.. వరుసపెట్టి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మొదటి షెడ్యూల్ సమయంలో హీరో రామ్ చరణ్‌కు గాయం కాగా.. కొద్దిరోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా చేతికి గాయం కావడంతో కొన్ని రోజులు షూటింగ్‌ను ఆపేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు మరోసారి అవరోధం ఏర్పడింది.
వారణాసిలో 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ సమయంలో అలియా భట్ పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడి.. వెంటనే అమెరికా వెళ్లిపోయిందని సమాచారం. ఆమె అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్ అనంతరం 'బ్రహ్మాస్త్ర'.. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో పాల్గొంటానని రాజమౌళికి మెసేజ్ పెట్టిందట. ఇప్పటికే లేట్ అవుతూ వస్తున్న 'ఆర్ఆర్ఆర్'కు ఇది మరో పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..