విజయ్, అట్లీ కొత్త చిత్రం టైటిల్ 'బిగిల్'
- June 21, 2019
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం `బిగిల్`( విజిల్ అనే అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. అట్లీ దర్శకుడు. ఎ.జి.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం హీరో విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ రెండు లుక్స్‌లో కనపడుతున్నారు. అంటే ఆయన రెండు పాత్రల్లో నటిస్తున్నారా? లేక రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారా? అనేది తెలియడం లేదు. అయితే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ రెండు పాత్రల్లో ఒకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర అయితే.. మరొకటి ఫుట్‌బాల్ ప్లేయర్ పాత్రట. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తున్నారు. `తెరి`, `మెర్సల్` చిత్రాల తర్వాత విజయ్ ,అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కావడంతో `బిగిల్` సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..