దుబాయ్:'PBSK' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన'అంతర్జాతీయ యోగా దినోత్సవం'
- June 22, 2019
దుబాయ్:దుబాయ్ లోని 'PBSK' ఆధ్వర్యంలో లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.దల్స్కో వర్కర్స్ క్యాంపులో ఈ కార్యక్రమం జరిగింది.10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
హర్జీత్ సింగ్ (వైస్ కౌన్సులర్-ఇండియన్ కాన్సులెట్) ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.హర్జీత్ సింగ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి యూఏఈ స్ట్రాంగ్ సపోర్టర్ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రస్తుత సమాజంలో వివిధ కారణాలతో స్ట్రెస్ ఎక్కువవుతోందనీ, అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతోందనీ, యోగా వీటన్నిటికీ చక్కని పరిష్కారమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్టిన్ వర్డ్ (ఫైనాన్సియల్ కౌన్సిలర్),కుసుమ్ దత్త (సోషల్ వర్కర్),అంజిత్(PBSK ఎగ్జిక్యూటివ్ ) మరియు యాస్టర్ హెల్త్ కేర్ టీం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం కార్మికులకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణి చేసారు.
--హరి (మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ