కజకిస్థాన్:ఆర్మీ ఆయుధ డిపోలో భారీ పేలుళ్లు
- June 25, 2019
ఆర్మీ ఆయుధ డిపోలో సోమవారం చోటుచేసుకున్న వరుస పేలుళ్లతో కజకిస్థాన్ వణికిపోయింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడగా, 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర కజక్లోని ఆర్మీ ఆయుధ డిపోలో సోమవారం ఈ పేలుళ్లు సంభవించినట్టు అధికారులు తెలిపారు. డిపోలో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో అందులోని ఆయుధాలు పెద్ద శబ్దంతో పేలిపోయినట్టు కజకిస్థాన్ రక్షణ శాఖ పేర్కొంది. పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భారీ పేలుడు సంభవించినప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన 50 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధ డిపోలో మంటలు ఎలా చెలరేగాయన్నది తెలియరాలేదు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..