ఖతార్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెచ్చరిక

- January 04, 2016 , by Maagulf
ఖతార్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెచ్చరిక

ఖతార్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ జనరల్‌ కమాండ్‌ హెచ్చరికల్ని జారీ చేసింది. మెరైన్‌ షూటింగ్‌ రేంజ్‌ యాక్టివ్‌ అయ్యిందనీ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రాంతం చుట్టు పక్కల ఎవరూ సంచరించరాదని హెచ్చరికల్లో పేర్కొంది. మెసైయీద్‌కి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం వుందని, మామూలుగా ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు ఇకపై, పైన పేర్కొన్న సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని జనరల్‌ కమాండ్‌ హెచ్చరించింది. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించి, ఫైరింగ్‌ రేంజ్‌కి దూరంగా ఉండాలని హెచ్చరికలో పేర్కొంది జనరల్‌ కమాండ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com