భవనాల్లో అగ్ని ప్రమాదం: 1,300 ఘటనల నమోదు

- June 28, 2019 , by Maagulf
భవనాల్లో అగ్ని ప్రమాదం: 1,300 ఘటనల నమోదు

మస్కట్‌: ప్రతి యేడాదీ భవనాల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ వెల్లడించింది. 2016లో మొత్తం 1100 రెసిడెన్షియల్‌ ఫైర్స్‌ చోటు చేసుకోగా, 2017లో ఈ సంఖ్య 1234గా నమోదయ్యింది. 2018లో ఈ సంఖ్య 1335గా నమోదయ్యింది. వైరింగ్‌లో లోపాలు, ఎలక్ట్రిసిటీ పోర్ట్స్‌కి సంబంధించి ఓవర్‌ లోడ్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల్ని ఎక్కువ సేపు వినియోగించడం, సరిగ్గా సర్వీసింగ్‌ చేయించకపోవడం వంటివి ఈ ఘటనలకు కారణంగా పిఎసిడిఎ పేర్కొంది. తడి చేతులతో ఎలక్ట్రానిక్‌ పరికరాల్ని తాకరాదనీ, వినియోగించిన వెంటనే వాటిని జాగ్రత్త చేయడం, అలాగే విరివిగా సర్వీసింగ్‌ చేయించడం వంటి చర్యల ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చని పిఎసిడిఎ వర్గాలు సూచిస్తున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com