అబుదాబీ టెంపుల్‌కి డొనేషన్‌ వయా మై సేవా క్రెడిట్‌ కార్డ్‌

- June 28, 2019 , by Maagulf
అబుదాబీ టెంపుల్‌కి డొనేషన్‌ వయా మై సేవా క్రెడిట్‌ కార్డ్‌

అబుదాబీలో తొలి హిందూ టెంపుల్‌, కొత్త క్రెడిట్‌ కార్డ్‌ని అందుబాటులోకి తెచ్చింది. 'మై సేవా' పేరుతో తెచ్చిన ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా టెంపుల్‌ కన్‌స్ట్రక్షన్‌ కోసం డొనేషన్లను ఆకర్షించనున్నారు. మై సేవా మాస్టర్‌ కార్డ్‌ వినియోగదారులు, 1 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చుననీ, దీన్ని టెంపుల్‌ నిర్మాణం కోసం చెల్లించవచ్చునని తెలుస్తోంది. పైలట్‌ ఫేజ్‌ ప్రాజెక్టులో భాగంగా తొలుత 100 మంది వినియోగదారులకు మాత్రమే ఈ కార్డులను జారీ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అలాగే యుటిలిటీ బిల్లుల్ని చెల్లించడానికి మాత్రం ఈ క్యాస్‌ బ్యాక్‌ వర్తించదు. క్యాష్‌ బ్యాక్‌ నుంచి 50 శాతం డొనేషన్‌ చేయాల్సి వుంటుందనీ, వినియోగదారులు 75 నుంచి 100 శాతం కూడా చెల్లించే అవకాశం వుంటుందని ఈ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com