యూఏఈలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరే అవకాశం
- June 29, 2019
అబుదాబీలోని లివాలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరనున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. దుబాయ్‌లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను అందుకోనున్నాయి. అబుదాబీలో 47 డిగ్రీల వరకూ వుండొచ్చు. షార్జాలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చనీ, వేడి ఎక్కువగా వుంటుందనీ, అక్కడక్కడా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని ఎన్‌సిఎం వెల్లడించింది. అత్యధికంగా హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్‌లో 65 నుంచి 85 శాతానికి చేరుకుంటుంది. ఇంటీరియర్ రీజియన్స్‌లో 60 నుంచి 80 శాతం వరకు, మౌంటెయిన్స్‌లో 50 నుంచి 70 శాతం వరకు హ్యుమిడిటీ వుండొచ్చు. గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్లుగా వుంటుంది. సముద్రం సాధారణ స్థాయిలోనే వుంటుంది. శనివారం, ఆదివారం అలాగే సోమవారం కూడా వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఇలాగే వుంటాయని ఎన్‌సిఎం వెల్లడించింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







