దుబాయ్-మంగళూరు ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
- July 01, 2019
దుబాయ్:ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మాత్రం మంగుళూరు ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్ 384 నిన్న సాయంత్రం మంగళూరు ఎయిర్ పోర్ట్ లో ల్యాండైంది. అయితే రన్ వే మీడానే ఆగాల్సిన ఈ విమానం ట్యాక్సీవే పైనుంచి కిందికి జారి గడ్డిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో విమానంలో 183 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం ఇక్కడ అభినందించాల్సిన విషయం. గడ్డిలో చిక్కుకున్న విమానం నుంచి ప్రయాణికులను సహాయక సిబ్బంది క్షేమంగా కిందికి దింపారు.
కాగా, ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.నిన్న జరిగిన ఘటనలో కూడా పైలట్ అప్రమత్తత వల్లనే అంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. అయితే ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!