ముంబయిలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాలంటే డెబిట్/క్రెడిట్ కార్డు..
- January 05, 2016
ట్రాఫిక్ నిబంధనలు అధిగమించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఫైన్ కట్టాల్సిందే. ఫైన్ వేస్తే మన పర్సులో ఉన్న డబ్బులు తీసి కట్టేస్తాం. అయితే ముంబయిలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాలంటే డెబిట్/క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే త్వరలో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు స్వైప్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై వాహనదారులను నుంచి జరిమానా వసూలు చేయాలంటే వారి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను తీసుకుని ఈ మిషన్లలో స్వైప్ చేస్తారు అంతే. ఈ విధానం ఈనెల 12 నుంచి అమల్లోకి రానుంది. జనవరి 12న రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వేల సంఖ్యలో స్వైప్ మిషన్లను ట్రాఫిక్ పోలీసులకు అందించారు. జనవరి 12 నుంచి నిబంధనలను అతిక్రమించే వాహనదారులకు ఈచలాన్ ద్వారా జరిమానా విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తక్షణం జరిమానా చెల్లించలేని వారికి 15రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. గడువు దాటితే మాత్రం రోజుకు రూ.10అదనంగా చెల్లించాల్సిందే. ట్రాఫిక్ విభాగంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







