దుబాయ్ బస్ యాక్సిడెంట్: తప్పిదాన్ని ఒప్పుకున్న డ్రైవర్
- July 02, 2019
ఒమన్ బస్ డ్రైవర్, బస్సు ప్రమాదానికి తప్పిదమే కారణమని ఒప్పుకున్నాడు. జూన్ 6న ఒమన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి చెందిన మవసలాత్ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. మృతుల్లో అత్యధికులు భారతదేశానికి చెందినవారే. తన తప్పిదం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయ్యిందని విచారణలో నిందితుడు అంగీకరించడం జరిగింది. విచారణ గురించి అడ్వొకేట్ జనరల్ అలాగే ఎమిరేట్ ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ హెడ్ సలాహ్ బో ఫర్రుచా అల్ ఫెలాసి మాట్లాడుతూ, 53 ఏళ్ళ డ్రైవర్, తన డ్రైవింగ్ కారణంగా బస్సు ప్రమాదానికి గురయ్యిందని ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ జులై 9వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!