బెండకాయలను నానబెట్టిన నీటిని తాగితే..
- July 03, 2019
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బెండకాయ కూరంటే చాలా ఇష్టం. పెళ్లి.. పేరంటాల్లో బెండకాయ ఫ్రై లేని విందు వుండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ బెండకాయలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. చిన్న బెండకాయలు రెండు లేదా మూడు తీసుకుని వాటిని బాగా కడిగి చివరు, మొదలు కట్ చేసి తీసెయ్యాలి. బెండకాయలను నిలువుగా కట్ చేసి అవి మునిగేలా నీటిని పోయాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని నీటిలో ఉంచితే అవి బాగా నాని వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఉదయాన్నేబెండకాయ ముక్కల్ని తీసేసి ఆ నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఈ నీటిని తాగడం వలన మన పొట్టలోని పేగులు, జీర్ణాయాన్ని శుభ్రపరుస్తాయి. ఎసిడిటి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. ఇంకా ఈ నీటిని తాగడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి హైబీపీ తగ్గుతుంది. గుండె పని తీరు మెరుగుపరిచేందుకు కూడ ఈ నీరు ఎంతో మేలు చేస్తుంది. టైప్2 డయాబెటిస్ ఉన్న వారు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానిక బెండకాయ నీరు పనిచేస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యలను నివారిస్తుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!